– వినాయకపురం అత్యధికం
– రామన్నగూడెం అత్యల్పం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం ముగిసింది. చివరి రోజున కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. నాయకుల ర్యాలీలు, అనుచరుల కేకలు, చివరి నిమిషపు పత్రాల పరుగు. మండల కేంద్రం రాజకీయం చలికాలంలోనూ వేడి ఎక్కుతుంది. అధికారులు హడావుడిగా రాత్రి 10 గంటలు వరకు పత్రాలు స్వీకరించాల్సివచ్చింది.
మొత్తం మండలంలో 27 సర్పంచ్ పదవులకు 145 నామినేషన్ లు,234 వార్డులకు 529 నామినేషన్లు పత్రాలు నమోదై,పలుచోట్ల అసలు పోటీ ఇప్పుడు మొదలైందనే సంకేతం స్పష్టమైంది. మండలంలో వినాయకపురం ఉత్కంఠగా మారనుంది.సర్పంచ్ పదవికి 10 మంది ఆశావాహులు నామినేషన్ లు వేసారు.12 వార్డులకు 38 మంది నామినేషన్ వేసారు. వినాయకపురం ఈసారి నామినేషన్ ల్లో రికార్డ్ సృష్టించింది.ఇక్కడ సర్పంచ్ పదవికి 10 మంది బరిలోకి దిగగా, 12 వార్డులకు 38 దరఖాస్తులు నమోదయ్యాయి.
గ్రామంలో వర్గాలు,గ్రూపులు వేడివేడి వాదోపవాదాలు,చర్చోపచర్చలు చేస్తున్నారు. అభ్యర్థుల జాబితా చూసిన రాజకీయ పరిశీలకులు చెప్పేది ఏమిటంటే “వినాయకపురం ఓట్ల యుద్ధానికి సిద్ధమైంది!” అని.ఇక్కడ పోటీ ఎంత తీవ్రంగా ఉందో నామినేషన్ల గణాంకాలే గట్టిగా చెప్తున్నాయి. రామన్నగూడెం లో ఒక సర్పంచ్,ఆరు వార్డ్ లకు ఒక్కో నామినేషన్ వేసారు. దీంతో ఈ పంచాయితి మాత్రం ఏకగ్రీవ దిశగా అడుగులు పడుతున్నాయి. వినాయకపురం అత్యధికం నామినేషన్ లతో ప్రధమ స్థానంలో ఉంటే, రామన్నగూడెంలో సర్పంచ్ కు ఒక్క నామినేషన్,6 వార్డులకూ ఒక్కో దరఖాస్తు వేయడంతో చివరి దశలో ఉంది.
ఈ సంఖ్యలు ఏం చెబుతున్నాయంటే గ్రామంలో పోటీకి అడుగు పెట్టే అవకాశమే లేకుండానే ఒకే అభిప్రాయం కుదిరింది. స్థానిక సమన్వయం, పెద్దల మాట, వర్గాల ఒప్పందం ఏదో ఒకటి బలంగా పనిచేసిందనే సంకేతాలు ఉన్నాయి. రామన్నగూడెం ఏకగ్రీవం దిశగా మారడానికి స్థానిక నాయకులు వేడివేడిగా, వేగంగా నడక సాగుతోంది.
మండల మొత్తం చిత్రమేమిటంటే…
ఈ ఎన్నికల్లో అశ్వారావుపేట మండలం రెండు దృశ్యాలు గా మారింది. ఒక వైపు వినాయకపురం, మల్లాయిగూడెం, నందిపాడు వంటి గ్రామాల్లో తీవ్ర పోటీ తో అభ్యర్థులు ఎక్కువ, వర్గాలు బలంగా, ఓట్లు చీలి పోవడం ఖాయం అనిపిస్తుంది. మరో వైపు రామన్నగూడెం వంటి గ్రామాల్లో ముందుగానే నిశ్శబ్దంగా రాజకీయ ఒప్పందాలు కుదిరాయి. సూటిగా ఏకగ్రీవం దిశ. ఇవే ఈసారి స్థానిక ఎన్నికలకు రెండు పార్శ్వాలు. మొత్తానికి, నామినేషన్ల దశ ముగిసినా, అశ్వారావుపేటలో అసలు రాజకీయ పోరాటం మంగళవారం మే మొదలు.



