Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో ఘనంగా వికలాంగుల దినోత్సవం

కమ్మర్ పల్లిలో ఘనంగా వికలాంగుల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవిత కేంద్రంలో వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి ఆంధ్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పట్ల చిన్నచూపు తగదన్నారు. వికలాంగులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగులకు సామాజిక, విద్య, ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తహసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ సరైన అవకాశాలు ఇస్తే ప్రతి వికలాంగుడు మహత్తర లక్ష్యాలను సాధిస్తాడని తెలిపారు.

అనంతరం వినికిడి లోపం ఉన్న వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వికలాంగులకు అతిథులు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆది నాగలక్ష్మి, ఐఇఆర్ పి  రాజన్న, స్పెషల్ ఎడ్యుకేటర్ మధుశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -