నవతెలంగాణ – పెద్దవూర
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగులను ఆటలు ఆడిపించి గెలిచిన వారికి పెద్దవూర మండల విద్యాధికారి తరిరాములు బహుమతులు అందజేశారు. వికలాంగుల కు స్వేట్లు,పంపిణి చేశారు. అందరికి ప్రోత్సాహక బహుమతులు అంద జేశారు. అనంతరం స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, మహేష్, రేణుక లను ఐఇఆర్పి రమేష్ ను పెద్దవూర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాములు నుశాలువాతో ఘన సన్మానం చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని మరియు భవిత సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు సార్ ఐఆర్పి రమేష్, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జీటీలు మహేష్ రేణుక ఉపాధ్యాయులు చంద్రమౌళి, నరేందర్, రాములు, సి ఆర్ పి వెంకటయ్య ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ విజయ, విజయ్, గౌతమ్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఆటల పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



