Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్  
శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు. డివిజన్ పరిధిలో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం ప్రాధమిక పాఠశాలను బుధవారం అక్కడ ఎన్నికల సందర్బంగా తీసుకుంటున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

 ఈ సదర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తు, పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.

ఎస్.ఎస్.టి మరియు ఎఫ్.ఎస్.టి ల ప్రకారం అన్ని మండలాల యందు పర్యవేక్షించడం జరుతున్నాయని, సమస్యాత్మకమైనని, అతిసమస్యాత్మకమైనవని ఏర్పాటు చేసి వాటి ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు మరియు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఎలప్పుడు పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.సి.పి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి,  ఎస్.హెచ్.ఓ  సత్యనారాయణ గౌడ్  ఆర్.ఓ  డి. సర్సయ్య ఎ.ఆర్.ఓ  శ్రీనివాస్ గౌడ్, సెక్రెటరీ సుఖన్య. ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -