ప్రారంభమైన మూడో విడత ఎన్నికల ప్రక్రియ
నవతెలంగాణ – మల్హర్ రావు
నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి,రెండవ విడతలు పూర్తి కాగా,మూడో విడత బుధవారం నుంచి ప్రారంభమైంది.మండలంలోని15 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు 30 నామినేషన్లు,128 వార్డు సభ్యుల స్థానాలకు 47 నామినేషన్లు దాఖలయ్యాయి.చిన్నతూoడ్ల సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం క్రాoతి,ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కోడారి చిన మల్లయ్య,ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జంగిడి శ్రీనివాస్, తాడిచెర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రావుల కల్పన మొగిలి,తాడిచెర్ల 5వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా ముద్దరవేని సురేష్ తోపాటు పలువురు దాఖలాలు ఆయా క్లస్టర్లలో నామినేషన్ వేశారు.తొలి,రెండవ విడతల నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పోస్టర్లు, బ్యానర్లు సిద్ధ చేసుకోవడంతోపాటు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు.
తొలిరోజు నామినేషన్ల జోరు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



