Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధ్యతలు స్వీకరించిన పెద్దవంగర తహశీల్దార్ 

బాధ్యతలు స్వీకరించిన పెద్దవంగర తహశీల్దార్ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
మండల నూతన తహసిల్దార్ గా బలభద్ర వినోద్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసిల్దార్ గా పని చేసిన మహేందర్ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. నూతన తహసిల్దార్ కు ఆర్ఐ భూక్యా లష్కర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు. ధృవ పత్రాల జారీలో జాప్యం వాటిల్లకుండా చూస్తానని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది అయ్యప్ప రెడ్డి, రోహిత్ రాజ్, రవి, మధు, అశోక్, స్వరూప, తరుణి, జీపీవో లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -