రెండు పంచాయితీలు ఏకగ్రీవం ఖాయం
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ల పరిశీలన బుధవారం ఎటువంటి అంతరాయం లేకుండా ముగిసింది. 27 పంచాయితీలకు 145 సర్పంచ్, 234 వార్డులకు 529 నామినేషన్ లు సమర్పించగా, పరిశీలన తర్వాత 107 సర్పంచ్, 522 వార్డు సభ్యుల పత్రాలు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. మద్దికొండ, రామన్నగూడెం పంచాయితీల్లో సర్పంచ్ తో పాటు వార్డులకూ ఒక్కో నామినేషన్ మాత్రమే వేసారు. దాంతో ఈ రెండు పంచాయితీలు ఏకగ్రీవంగా నమోదు కాబోవడం ఖచ్చితమైంది. మిగతా 25 పంచాయితీలలో ఎన్నికలు తప్పనిసరి అవగా, పోటీ వాతావరణం వేడెక్కుతోంది.
నియమాలు స్పష్టంగా ఉన్నాయి. పత్రాల పరిశీలన పూర్తయింది. ఏకగ్రీవం అయ్యేవి అయ్యాయి. ఇక మిగిలింది 25 పంచాయితీల్లో నేరుగా ప్రజా తీర్పు మాత్రమే.



