– గ్రామ పరిపాలన అధికారుల మండల కమిటీ ఎన్నిక
– మండల అధ్యక్షులు మహమ్మద్ సాజిత్
నవతెలంగాణ – ఊరుకొండ
గ్రామ పరిపాలన అధికారులు ఐక్యంగా ఏక తాటిపైకి వచ్చితమ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని గ్రామ పరిపాలన అధికారుల నూతన మండల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ సాజిత్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలో గ్రామ పాలన అధికారుల అసోసియేషన్ రాష్ట కమిటీ ఆదేశానుసారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిల పిలుపుమేరకు ఊర్కొండ మండల నూతన కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ పరిపాలన అధకారుల మండల కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ సాజిత్, కార్యదర్శిగా సునీత, కోశాధికారి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా పుష్పలత లను కమిటీ సభ్యులుగా నియమించారు. అనంతరం ఊరుకొండ తహశీల్దార్ యూసుఫ్ అలీని జిల్లా కమిటీ సభ్యులు పూలమాలలు శాలువాలతో సత్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ ని మరియు నూతనంగా ఏర్పడిన మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను తహశీల్దార్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఏ.శంకర్, కల్వకుర్తి డివిజన్ అధ్యక్షులు టి.ఆంజనేయులు, మండల జిపిఒ లు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


