- Advertisement -
– మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 29న కేసీఆర్ అరెస్టును తట్టుకోలేక, తెలంగాణ ఆకాంక్ష కోసం ఆయన దేహాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన బలిదానం చేసి కోట్లాది మంది గుండెల్లో ఉద్యమ కాంక్షను రగిలించారని పేర్కొన్నారు. ఆయన పోరాటం, త్యాగం వృధా కాలేదని తెలిపారు. తెలంగాణ సమాజం ఆయన్ను ఎప్పటికీ మరువబోదని పేర్కొన్నారు.
- Advertisement -



