Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం సర్పంచి పీఠం ఎవరిని వరించునో.!

కాటారం సర్పంచి పీఠం ఎవరిని వరించునో.!

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
సబ్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయితీలలో కాటారం జీపీనే మొదటిది. అందులోనూ మేజర్ గ్రామపంచాయతీ. నాలుగు మండలాలకు ఇదే ప్రధాన కూడలి కావడం విశేషం. 2011 గణాంకాల ప్రకారం 3833 ఓటర్లు ఉన్న కాటారం గ్రామపంచాయతీలో స్థానిక ఎన్నికల విషయానికొస్తే అధికార పార్టీలో బలమైన అభ్యర్థి లేడనే చర్చ జోరుగా స్థానికంగా జరుగుతుంది. తాజాగా ఎన్నికల సంఘం కాటారం గ్రామపంచాయతీ అభ్యర్థి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.

మండల కేంద్రమైన కాటారం సర్పంచి పీఠాన్ని ఎలాగైనా తామే కైవసం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ కాటారం సర్పంచి పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహుల్లో సందడి మొదలైనప్పటికీ అధికార పార్టీ కాంగ్రెస్ లో స్థానిక బరిలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో అధిష్టానం సందిగ్ధంలో  పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి స్థానికం కలిసొచ్చే అవకాశం ఉన్నందున ఎలాగైనా కాటారం సర్పంచ్ పీఠాన్ని మళ్లీ తన ఖాతాలో వేసుకునేందుకు బలమైన ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే 17న జరిగే మూడవ విడత స్థానిక ఎన్నికల్లో అదృష్టం ఏ పార్టీకి వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -