Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅందర్నీ భయపెట్టే 'ఈషా'

అందర్నీ భయపెట్టే ‘ఈషా’

- Advertisement -

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ ‘ఈషా’ చిత్రాన్ని ఈనెల 12న థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడు శ్రీనివాస్‌ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు.

సినిమా అంటే ఎంతో పాషన్‌ ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు. వీళ్ళ జర్నీ చూస్తే నాకు వాళ్లు చిన్న సినిమాలకు ఇస్తున్న ఆశ, సపోర్ట్‌ ఎంతో గొప్పది. డబ్బుంటే సినిమా చేయవచ్చు.కానీ ఆ సినిమాను థియేటర్‌ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్‌ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు’ అని అన్నారు. ‘మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్‌ ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ‘అందరిని భయపెట్టే సినిమా. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికి ఎంతో థ్రిల్ల్‌ను కలిగిస్తుంది. చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ బన్నీవాస్‌ అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూసిన తరువాత నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -