Friday, December 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపంచాయతీ రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

పంచాయతీ రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ జనాభా లేని చోట కూడా ఆయా కులాలకు వార్డుమెంబర్లు, సర్పంచి రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్‌ రిజర్వేషన్లు కేటాయించటం వల్ల తప్పులు దొర్లాయని తెలిపారు. రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఎస్‌ఈసీ వాదనను రికార్డు చేసుకున్న హైకోర్టు.. పిటిషన్లపై విచారణ ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -