Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయండి

ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయండి

- Advertisement -

ఆరు జిల్లాల ఎస్పీలకు డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశం

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నియమావళిని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. గురువారం ఉత్తర తెలంగాణకు చెందిన ఆరు జిల్లాల ఎస్పీలతో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై ఆయన సమీక్షను నిర్వహించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు ఎవరు పాల్పడినా ఉపేక్షించరాదనీ, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్థానికంగా పాత కక్షలతో పాటు వివిధ అంశాలపై భేదాభిప్రాయాలు పొడసూపి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదమున్నదనీ, వాటిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని డీపీజీ సూచించారు. సెక్షన్‌ 30 ప్రకారం నిషేదాజ్ఞలను అమలు చేయాలనీ, రౌడీలు, గూండాలను బైండోవర్‌ చేసే విషయంలో చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేలా వాతావరణాన్ని కల్పించాలనీ, ఎన్నికల అధికారులతో సమన్వయం అవుతూ పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -