Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగోవిందపురం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బుర్రు అనిల్ కుమార్

గోవిందపురం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బుర్రు అనిల్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – అడ్డగూడూర్: ఈ రోజు గోవిందపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బుర్రు అనిల్ కుమార్ అడ్డగుడూర్ గ్రామ పంచాయితీలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను నాకు తెలిసినంతగ ఎవరికి తెలుసు అన్ని అన్నారు. గ్రామంలో నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే మీకు నాయకుడిగా కాకుండా సేవాకుడిగా పని చేస్తా అన్ని అన్నారు. గ్రామంలో చదువుకుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా స్కార్షిప్స్ పెట్టిస్తా అన్ని అన్నారు. గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తా అన్ని అదే విధంగా గ్రామ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎర్రబాటను మోరాం పోసి అభివృద్ధి చేస్తా అన్ని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నారు. యువకుడిగా స్థానికంగా ఉంటున్న నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని గోవిందపురం గ్రామ ప్రజలను కోరారు. అదే విధంగా వార్డు సభ్యులుగా మాధాను థామస్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మోత్కూర్ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, ఆత్మకూర్ మండల కార్యదర్శి కూరేళ్ల బిక్షం, గోవిందపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -