– భీమగోనిని హేమలత సంతోష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్: ఆలేరు మండలం కొలనుపాక లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమగోని హేమలత సంతోష్ శుక్రవారం నాడు కొలనుపాకలో ఇంటింట ప్రచారం చేసి నవతెలంగాణతో మాట్లాడారు. తాము రాజకీయాల్లో రావడానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్ఫూర్తి అని తెలిపారు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తను జన్మించిన కొలనుపాక గ్రామానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నాలుగేండ్లుగా ప్రజల్లో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని తనకు చేతనైన సహాయం చేస్తూ ఉన్న క్రమంలో కొలనుపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా యువతీ యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారని వారికి ఉపాధి కల్పించడే ధ్యేయంగా పని చేస్తానన్నారు. అందుకోసం గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేయించడం ద్వారా తన లక్ష్యం నెరవేరుతుంది అన్నారు.
గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఇప్పటికే గ్రామంలో అనేక మందికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రుణమాఫీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తను రాజకీయాలకు కొత్త అయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు ఎక్కువగా తీసుకురావడమే అందుకోసం నిరంతరం స్థానిక ఎమ్మెల్యే వెంటపడి పనులు చేయించడమే కర్తవ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు.
సర్పంచ్ గా తన గుర్తు కత్తెర వచ్చిందన్నారు. హేమలతను గెలిపించినట్లయితే కొలనుపాక ప్రజలకు సేవ చేసుకుంటూ పార్టీలకు అతీతంగా అందర్నీ కలుపుకుంటూ గ్రామంలో వీధిదీపాలు, డ్రైనేజ్ సిసి రోడ్లు సమస్యలు ప్రతి వార్డులో ఏర్పాటు చేయిస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను సక్రమంగా నిజాయితీగా ఖర్చుపెట్టి గ్రామ సభలో ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు లెక్కలు బిల్లులతో సహా చూపిస్తా అన్నారు. తనకు ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, గ్రామశాఖ అధ్యక్షులు గొట్టం విజేందర్రెడ్డి, గాదె సోమిరెడ్డి, మామిడాల అశోక్, మోత్కూరి ఐలయ్య, అమృతం బాలరాజు, సొంటెం మహేష్, బైరి రమేష్, గంధమల్ల కర్ణాకర్, వల్దీష్ మహేష్, మామిడాల కిరణ్, శాడ రాజు తదితరులు పాల్గొన్నారు.



