రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూరు : ఈనెల 19న గట్టుప్పల లో జరిగే భూభారతి అవగాహన సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలను పరిష్కారం చూపుతానని 2020 సెప్టెంబర్ 9న ఆర్డినెన్స్ ద్వారా బీ (టి ) ఆర్ఎస్ ప్రభుత్వం దరణి చట్టాలు తీసుకొచ్చిందని, ఈ చట్టాన్ని 2020 సెప్టెంబర్ 19న అమలు చేశారని ఆయన అన్నారు. కానీ ఈ ధరణి చట్టంలో మొత్తం 18 సెక్షన్స్ తో తెచ్చిన చట్టం రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పింది కానీ, వాస్తవములో 33 లోపాలతో 13 లక్షల మందికి పాసు పుస్తకాలు లేకుండా కోర్టుల చుట్టూ తిరిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 14న 2025న 19 అంశాలతో భూ భారతికి రూల్స్ ఆమోదించారని, భూభారతి వల్ల సమస్యలు ఉన్నవారు ఒక్క రూపాయి చెల్లించకుండా తప్పొప్పులను సరి దిద్దుతున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి పదేపదే చెప్పారని కానీ ధరణిని, భూభారతిని ఈ రెండు చట్టాల నిబంధనల్ని లోతుగా విశ్లేషిస్తే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధరణిలోనూ, భూభారతిలోనూ కొన్ని అంశాలు ఒకే విధంగా ఉన్నాయని, సాదా బైనామాలు, కౌలుదారుల హక్కులు, ఎలాంటి లోసగులు లేకుండా వారసత్వ పట్టాలు మార్పిడి చేయాలని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ధరణి లాగానే, భూభారతి చట్టం కూడా సమస్యలు పరిష్కరించకపోతే భూభారతి చట్టం కూడా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. నేడు గట్టుప్పల మండలంలో జరిగే భూభారతి చట్టం అవగాహన సదస్సుకు రైతులు, కూలీలు, కార్మికులు, మేధావులు,హాజరుకావాలని ఆయన అన్నారు. ఈ అవగాహన సదస్సుకు రైతు సంఘం జాతీయనాయకులు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ, ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ అచ్చిన శ్రీనివాస్, సిఐటియు నాయకులు పగిళ్ల శ్రీనివాస్, రైతు సంఘం నాయకులుబండారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
19న భూభారతి అవగాహన సదస్సు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES