జిల్లా కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల విజ్ఞప్తి
నవతెలంగా – వనపర్తి
వనపర్తి పట్టణంలో 2025 అక్టోబర్ నెల నుండి ఒక ట్రాక్టర్ పెళ్ళాకు 20 వేలకు రేటు పెంచడం ద్వారా అదనంగా గతం కట్టే రూ.8000 పెంచి పేద ప్రజలపై భారం మోపారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంధం మదన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఆరోపించారు. పెంచిన ఇటుక (పే ల్ల) రేట్లను వెంటనే తగ్గించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2025 సెప్టెంబర్ నెల వరకు ఒక ట్రాక్టర్లు ఇటుక 12 వేల రూపాయలు చొప్పున అమ్మేవారని ఇటుక బట్టి యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి 2025 అక్టోబర్ నెల నుండి ఒక ట్రాక్టర్ ఇటుకకు 20వేల చొప్పున అమ్ముతున్నారని అదనంగా రూ.8000 వేల ఒక ట్రాక్టర్ ద్వారా పేద ప్రజలపై భారం మోపారని వారు ఆరోపించారు.
ప్రభుత్వము కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఇటుకను కొనుగోలు చేయా లేఖ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు ఆర్థికoగ సరిగ్గా లేక పోవడం ద్వారా ఇండ్లు మంజూరైన నిర్మాణం చేసుకోలేకపోతున్నారని వారు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా పనులు దొరకడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి కురుమన్న సహకార దర్శి రాబర్ట్ గంధం నాగరాజుబాలస్వామి రవి సి పుల్లన్న జి రవి బాల పేరు శ్రీనివాసులు ఏ మన్యం చంద్రయ్య ఈ మన్యం తదితరులు పాల్గొన్నారు.



