Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశీర్వదించండి.. గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

ఆశీర్వదించండి.. గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
మాసాయిపేట గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కళ్లెం జహంగీర్ గౌడ్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరికీ మంచినీటి, త్రాగునీరు సౌకర్యం ఉచితంగా కల్పిస్తానని అన్నారు.

గ్రామంలో కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫ్రీజర్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ ఉచితంగా కల్పిస్తానని తెలిపారు. మృతుని కుటుంబానికి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ కుటుంబంలోనైనా ఆడపిల్ల జన్మిస్తే పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని అన్నారు. నిరుద్యోగ ఆడపడుచుల కోసం నిరంతరం 30 కుట్టుమిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

పాఠశాలల అభివృద్ధి కోసం కాలానికి అనుగుణంగా పిల్లలకు పుస్తకాలు, సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. మిగిలి ఉన్న గ్రామ దేవతల గుడి నిర్మాణం చేస్తానని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో కూడిన సిసి రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. నిరంతర బస్తి దావఖాన, గ్రంథాలయం ఏర్పాటు, గౌడ సంఘం వద్ద సర్దాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆటో స్టాండ్ వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటు, కొండలమ్మ తల్లి కమాన్, వారానికి ఒకరోజు వార్డు సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -