Friday, December 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రక్తదానం చేసిన జర్నలిస్టు శ్రీకాంత్

రక్తదానం చేసిన జర్నలిస్టు శ్రీకాంత్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తమ జన్మదినం పురస్కరించుకొని కొందరు ఎలాంటి హాంగు ఆర్భాటాలు వేడుకలు నిర్వహించకుండా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన జర్నలిస్ట్ గాజరి శ్రీకాంత్ శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని రిమ్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని శ్రీకాంత్ తెలిపాడు. పుట్టినరోజు వేళ రక్తదానం చేయడం సంతోషంగా ఉందని, రక్తదానం చేయడం ఇది ఆరవ సారి అని పేర్కొన్నారు. అన్ని దానాలలో ప్రధానమైన దానం రక్తదానమని తెలిపాడు. రక్తదానం చేసి రక్తహీనులను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో సూరం తిరుపతి, తక్కల్ల సాయి రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -