Monday, May 19, 2025
Homeఆదిలాబాద్ఆరోపణలు చేయడం సరికాదు..

ఆరోపణలు చేయడం సరికాదు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం:  అటవీ అధికారులపై ప్రతి కారం తీర్చుకోవడానికి అటవీ భూములలో నుంచి మట్టిని తవ్వి తీసుకెళుతున్నారని జన్నారం మాజీ  ఎంపీటీసీ రియాజుద్దీన్ లేని ఆరోపణలు చేయడం తగదని, కామన్ పళ్లి దేవుని గుడా రైతులు అన్నారు. ఆదివారం జన్నారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. కామాన్పల్లి దేవుని గూడా గ్రామాలలో ఉన్న నరసింహులు గుట్ట పక్కనే అడవికి 40 మీటర్ల దూరంలో తమ పట్టా భూమి ఉన్నదని, అందులో నుంచే మట్టిని తవ్వుకొని తమ పొలాలకు వేసుకుంటున్నామన్నారు. కానీ మాజీ ఎంపీటీసీ రియాజుద్దీన్, గతంలో అటవీశాఖ అధికారులు అతనిపై కేసు పెడితే 14 రోజులు రిమైండ్లో ఉండి వచ్చిన కోపంతో, అటవీశాఖ అధికారులపై అత్కసుతో అటవీ భూమిలో నుంచి మట్టిని తవ్వుతున్నారని ప్రెస్ మీట్ పెట్టడం అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు అనటం హేమమైన చర్య అన్నారు. ఆ చెరువులో నుంచి మట్టిని తవ్వడం వల్ల చెరువు లోతుఅయి భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నారు. చెరువు కింది ఆయకట్టు భూములు సమృద్ధిగా పంటలు పండుతాయి అన్నారు. రైతులపై ఇలాంటి ఆరోపాలను చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, వంగపెల్లి రాజేశ్వరరావు, తోట లచ్చన్న, రవి గౌడ్ బీరు పూరి రవి ఆకుల రాకేష్ ఇండ్ల సాయి, రేండ్ల బుచ్చన్న  గుడ్ల మల్లేష్ కండ్ల దుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -