నవతెలంగాణ-సూర్యాపేట
శ్రీ సంతోషి మాత అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మునిసిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక శ్రీ సంతోషిమాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. విజయదశమి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఈ సందర్భంగా దేవాలయములో ఏర్పాటుచేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాతా దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణపల్లి మురళీధర్, కొత్త మల్లికార్జున్, పబ్బా ప్రకాష్, పాలవరపు రామమూర్తి, తాళ్లపల్లి రామయ్య, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, గోపారపురాజు, మున్సిపల్ అధికారులు ఎస్ఎస్ఆర్ ప్రసాద్, సుమంత్, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం, దేవాలయ ప్రధానార్చకులు ఇరువంటి శివరామకష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ విజయదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నేరేడుచర్ల లోని విజయ దుర్గ ఆలయంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.