Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్వాసవి క్లబ్ కురువ అధ్యక్షులకు సన్మానం ..

వాసవి క్లబ్ కురువ అధ్యక్షులకు సన్మానం ..

- Advertisement -

మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలి 
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం వాసవి క్లబ్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు అధ్యక్షులుగా కొనసాగిన వారిని ఆదివారం సన్మానించినట్లు ప్రస్తుత అధ్యక్షుడు తుడుపునూరు నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బిబిపేట మండలం వాసవి క్లబ్ 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ  యాదగిరిగుట్ట నందు గల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం లో బాసెట్టి నాగేశ్వర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ మున్మందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతర క్లబ్బులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పూర్వ అధ్యక్షులు ప్రతి ఒక్కరు వాసవి క్లబ్ ద్వారా చేసే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, రక్తదాన శిబిరాలతొ పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు తుడుపునూరి నాగభూషణంతో పాటు పూర్వాధ్యక్షులు తాటిపల్లి రమేష్ , దుద్దెల విశ్వప్రసాద్, ఎర్రం ప్రసాద్, భాశెట్టి వెంకటేశం, ఎర్రం ప్రసాద్, ఉప్పల మనోజ్, నీలా భైరయ్య, బచ్చు రామచంద్ర,   రెడ్డి శెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -