Monday, May 19, 2025
Homeజిల్లాలునకిలీ కంటి వైద్యుడిపై కేసు ..

నకిలీ కంటి వైద్యుడిపై కేసు ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నకిలీ కంటి వైద్యునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు అయినటువంటి మేకల రాకేష్ విజిలెన్స్ ఆఫీసర్ నివాసం సుల్తాన్ బజార్ హైదరాబాద్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగరంలోని ఖలీల్ వాడి లైన్స్ కంటి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ ద్వారా నకిలీ వైద్యుడు దొడ్డిముంగట్టి సతీష్ ఆప్తమాలజిస్ట్ డాక్టరేట్ పట్టలేకుండా నిజామాబాద్ లైన్స్ ఐ హాస్పిటల్ లో రోగులకు వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పేషెంట్స్ కు ఇంజక్షన్స్, ఐ వి ఫ్రూట్స్ ఎక్కిస్తున్న ఈ వ్యక్తి ప్రజలకు మోసం చేస్తూ చలామవుతున్న నకిలీ డాక్టర్ పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -