ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
నవభారత నిర్మాత పేదోని తలరాత రాజ్యాంగ ప్రదాత డా.బి ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల బాధను చూసి సహించలేక జీవితాంతం శ్రమించి అగ్రవర్ణ పెత్తందారులతో పోరాడి 125 దేశాల రాజ్యాంగాన్ని చదివి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి మహోన్నతమైన భారత నిర్మించారన్నారు.
ముఖ్యంగా మహిళలకు సమాన హక్కు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పచ్చని ప్రకృతినిచ్చే వృక్షాలకు పారే నదులకు జంతుజాతికి సైతం స్వేచ్ఛని కల్పించిన మహోన్నతుడని కొనియాడారు. ఓటు ద్వారానే రాజ్యాధికారం వస్తుందని పేదవాడు చేతికి ఓటునిస్తే ఆ ఓటును ఇవ్వాళ అమ్ముకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జాడీ రాజు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఉపాధ్యక్షులు ముండ్ల గిరి కాంతయ్య దారం మల్లేశ్ యాదవ్. పెరుమాళ్ళ ధనమ్మ, బీసీ మహిళా నాయకురాలు బంటు కవిత ఇంజమూరి లలిత, చిత్రం ఉమా, తాళ్లపల్లి నర్సయ్య, తాళ్లపల్లి విజయ్, గుణగంటి జానయ్య, వట్టెపు సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



