Sunday, December 7, 2025
E-PAPER
Homeకవితవీరపుత్రున్నికన్న పుంజీ

వీరపుత్రున్నికన్న పుంజీ

- Advertisement -

డొక్కలెండిపోయిన నీ ఉదరం..
ఉద్యమాల బిడ్డను మోసింది నవమాసాలు.
కొడుకుని కడసారి సూడటంకోసం..
అడవితల్లి ఎదపై అడుగులువేస్తూ..నడుస్తుంటే
అమ్మా …సింహం నడుస్తున్నట్లు ఉంది.
గర్జించే చిరుతపులి వేగంగా నడుస్తున్నట్లు ఉంది.
వీరయోధున్ని కన్న వీరవనితా..
పోరాటయోధున్ని కన్న తల్లీ…నీకు వందనం.
గిరిజనపుత్రుడు గిరిగీసి కొట్లాడాడు…
పేదప్రజల కూడుగుడ్డ కోసం నీ పోరాటం…
మరిచిపోదు ఈ సమాజం.
గాలి గమ్మున ఉండిపోయింది.
సెట్లు మౌనాన్ని దాల్చి పత్రాల వర్షాన్ని కురిపిస్తున్నాయి.
నీ మరణవార్త విని ఆకాశం బోరున విలపిస్తుంది.
నిప్పుల్లో దేహం దహించుకపోతుంటే.. అగ్గి నీ రూపాన్నిదాల్చికొని
గిరి”జనానికి” మరో పోరాటాల వెలుగు దారిని చూపిస్తుంది.
దేహంలోని ప్రతి కణం.. కంకణం కట్టుకొని
మరెందరో పోరాట యోధుల్ని తయారుచేస్తుంది.
కాంతారము గుండెలు ఆగిపోయేలా ఏడుస్తుంది.
ఇన్నిరోజులు నీకు ఆశ్రయం ఇచ్చిన విపినము
హదయపుగోస..మహాసముద్రాలై పారుతుంది.
హిడ్మా.. నీతల్లి పుంజీ కంటినుండి కారుతున్న కన్నీటి చుక్కల సాక్షిగా వధాపోదు నీ మరణం.

  • అశోక్‌ గోనె, 9441317361
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -