కాంగ్రెస్‌ను శంకించాల్సిన అవసరం లేదు : పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
వీహెచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి
నవతెలంగాణ – హైదరాబాద్
బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని, పార్టీని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. శనివారం రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో అంబర్‌పేట చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : మహేశ్‌కుమార్ గౌడ్
కార్యక్రమంలో భాగంగా బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వర్ చారి మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్‌ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో పోరాడుతారని తెలిపారు. మున్ముందు రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని ఆశాభావం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ తదుపరి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి, చట్టం చేసి, పార్లమెంటులో ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇది ఒక్క రాహుల్ గాంధీ వల్లే సాధ్యమని నొక్కివొక్కాణించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు ఆఫీసర్ యూసుఫ్ జాయి, జగదీశ్వర్ రావు, నవాబ ముజాహిద్ ఆలం, పీసీసీ జనరల్ సెక్రెటరీలు కత్తి వెంకటస్వామి, మధు సత్యం, ఒట్టికూటి రామారావు, పార్టీ రాష్ట్ర లింజిస్టిక్ సెల్ చైర్మన్ రాజేష్ అగర్వాల్, పీసీసీ కార్యదర్శులు యాదగిరి గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పి.నారాయణస్వామి, దిడ్డి రాంబాబు, గరిగంటి రమేష్, జగన్, సత్తిబాబు గౌడ్, రామ్మోహన్, ప్రభాకర్, షేక్ జమీర్, గడ్డం శ్రీధర్ గౌడ్, కోట అనిల్, రావుల సుధాకర్, జాంగిర్ భాయ్, అక్బర్ బాయ్గ, ఫరీద్, లక్ష్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



