Monday, May 19, 2025
Homeజాతీయంబీజేపీయేతర సీఎంలంతా ఐక్యం కావాలి: స్టాలిన్‌

బీజేపీయేతర సీఎంలంతా ఐక్యం కావాలి: స్టాలిన్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించేందుకు బిజెపియేతర ముఖ్యమంత్రులంతా ఐక్యం కావాలని సిఎం స్టాలిన్‌ కోరారు. రాష్ట్రబిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించిన సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న చర్యపై స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సూచనలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించేందుకు ఐక్యతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ కీలకమైన అంశంలో మీ తక్షణ, వ్యక్తిగత జోక్యానికి ఎదురుచూస్తున్నానని స్టాలిన్‌ ఆదివారం బిజెపియేరత పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మనమంతా సమన్వయంతో చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని బిజెపియేతర సిఎంలను కోరారు.

‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్‌ రాష్ట్ర గవర్నర్‌ ‘ కేసులో సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయడాన్ని ఉద్దేశిస్తూ.. రాష్ట్రపతి సుప్రీంకోర్టులో 14 ప్రశ్నలను లేవనెత్తారని అన్నారు. తమిళనాడు కేసులో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు తన రాష్ట్రానికే మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమాఖ్య నిర్మాణాన్ని, అధికారాన్ని సమర్థిస్తుందని, దీంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీలు రూపొందించిన బిల్లులను కేంద్రం నియమించిన గవర్నర్‌ అడ్డుకోవడాన్ని నిరోధించవచ్చని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు ఆమోదించే బిల్లులను అడ్డుకునేందుకు లేదా ఆలస్యం చేసేందుకు కేంద్రం గవర్నర్‌లను ఉపయోగించిన తీరుకు మనమంతా సాక్షులమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్‌ సలహామేరకే గవర్నర్‌ వ్యవహరించాలని, బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో నిరవధికంగా జాప్యం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని స్టాలిన్‌ తెలిపారు. అది అసెంబ్లీ ద్వారా తిరరిగి పంపితే, బిల్లులపై గవర్నర్‌, రాష్ట్రపతులు చర్యలు తీసుకునేలా ఆర్టికల్‌ 200 మరియు 201 కింద స్పష్టమైన గడువు నిర్దేశించబడిందని పేర్కొన్నారు. ఈ తీర్పు రాజ్యాంగ పరిధిలో ముఖ్యమంత్రుల పాత్రలు మరియు బాధ్యతలను నిర్వర్తించే రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోకుండా అడ్డుకుంటుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -