Monday, May 19, 2025
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో విద్యార్థినికి తీవ్రగాయాలు

విద్యుత్ షాక్ తో విద్యార్థినికి తీవ్రగాయాలు

- Advertisement -

ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు ..
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండలంలోని మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న లింగాల గ్రామపంచాయతీ పరిధిలో గల కొడిశల గ్రామానికి చెందిన అనాధ ఆదివాసి బిడ్డ మొగిలిపెళ్లి సమీర ఆదివారం విద్యుత్ షాక్ కు గురై తీవ్ర అస్వస్థ గురైంది. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన సమీర సమీప పొలాల్లో ఉన్న మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోయడానికి వెళ్ళింది. మామిడి చెట్టు పై నుండి పెద్ద విద్యుత్ లైన్ వెళ్ళింది. ఆమె మామిడి చెట్టు కొమ్మ పైకి ఎక్కగానే కొమ్మా కిందికి వంగి విద్యుత్ యొక్క ఆనింది. దీంతో విద్యుత్ షాక్ గురైన సమీరా మంటలు మండి కింద పడిపోయింది. స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడికి గ్రామస్తులు చేరుకొని ఆమెను 108 ద్వారా ములుగు ప్రభుత్వ హాస్పటల్ కు తరలించి వైద్యం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కొరకు ఎంజీఎం కు తరలించారు.కాగా మొగిలిపెళ్లి సమీర యొక్క తల్లిదండ్రులు ఇద్దరు గత ఆరేడు ఏండ్లు సంవత్సరాల క్రితం మృతి చెందారు. సమీర కు ఒక అక్క ఉంది. అక్క ఒక బాబాయి వద్ద, సమీరా ఒక బాబాయి వద్ద ఉంటున్నారు. ఇద్దరు బాబాయిలు చెరొక్కరిని సాదుతున్నారు. ఈ విషయం తెలవగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమీరా అనే ఆదివాసి విద్యార్థినికి మెరుగైన వైద్యానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -