Monday, December 8, 2025
E-PAPER
Homeఆటలుపింక్‌ టెస్టు ఆసీస్‌దే

పింక్‌ టెస్టు ఆసీస్‌దే

- Advertisement -

బ్రిస్బేన్‌ : డేనైట్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా అదిరే విజయం సాధించింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 10 ఓవర్లలో ఊదేసింది. ట్రావిశ్‌ హెడ్‌ (22), స్టీవ్‌ స్మిత్‌ (23 నాటౌట్‌), జేక్‌ వెథర్‌లాండ్‌ (17) మెరవటంతో 60 బంతుల్లోనే 69/2తో లాంఛనం ముగించింది. అంతకుముందు, మైకల్‌ నెసర్‌ (5/42) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే కుప్పకూలింది. జాక్‌ క్రాలీ (44), బెన్‌ స్టోక్స్‌ (50), విల్‌ జాక్స్‌ (41)లు మెరిసినా.. ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సహా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌్‌ మూడో టెస్టు ఈ నెల 17 నుంచి ఆడిలైడ్‌లో జరుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -