Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్దే.. దేశాభివృద్ధి

గ్రామాభివృద్దే.. దేశాభివృద్ధి

- Advertisement -

అన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము జయరాజ్
నవతెలంగాణ – తుంగతుర్తి
గ్రామాభివృద్దే….దేశాభివృద్ధి అని, గ్రామాల అభివృద్ధి బిఎస్పీ తోనే సాధ్యమని ఆ పార్టీ అన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము జయరాజ్ అన్నారు. సోమవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంచుతూ తన బ్యాగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో అత్యధిక జనాభా ప్రధానంగా గ్రామాల్లోనే నివసిస్తున్నారని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చడం బిఎస్పీకే సాధ్యమన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుపరచడంలో విఫలమయ్యాయని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికాకుండా బ్యాగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -