సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రమ ఈరోజి
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రజాసేవపై ఉన్న ఆసక్తి, తాను పుట్టిన గ్రామం బాగుపడాలన్న దృఢసంకల్పంతో పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని గుగులోత్ రమ ఈరోజి అన్నారు. సోమవారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అధికారమన్నది ప్రజాసేవకే తప్ప స్వార్థం కోసం కాదన్నారు. ప్రజల శ్రేయస్సే తనకి ముఖ్యమని, వారికి ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల కోసం కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ ప్రచారంలో గుగులోతు రమేష్, బాలు, సుధాకర్ తదితరులు ఉన్నారు.
దేవునిగుట్ట తండాను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


