నవతెలంగాణ – ముధోల్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బైంసా ఎఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడారు. ఫ్లాగ్ మార్చ్ తో ప్రజల్లో నమ్మకం పెంపొందించడం , శాంతి భద్రతలు కాపాడడం , ప్రధాన ఉద్దేశం అన్నారు.ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి, ఎన్నికల నియమాలు పాటించాలని ఆయన కోరారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో కావాలని గందరగోళంసృష్టించడం,బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ని ధిక్కరించిన వారిపై చర్యలు తప్పవన్నారు .ఈ కార్యక్రమంలో ముధోల్ సిఐమల్లేష్, బాసర సిఐసాయి కుమార్, ఎస్ఐ లు బిట్ల పెర్సెస్, అశోక్,గంగాదర్, నవనిత్, పొలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.
ముధోల్ లో పోలిసుల ఫ్లాగ్ మార్చ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



