నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ – కట్టంగూర్
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్టంగూరు, ఐటిపాముల,ఈదులూరు, బోల్లేపల్లి, చెరువుఅన్నారం, కురుమర్తి,మునుకుంట్ల తదితర గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా చూడాలని ఓటర్లను కోరారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కట్టంగూర్ ను ఆదర్శ గ్రామపంచాయతీ గా అన్ని సౌకర్యాలు ఉన్న మండల కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది చుక్కయ్య, మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, సర్పంచ్ అభ్యర్థులు బుచ్చాల నాగమ్మ, పెద్ది యాదగిరి, అయితగోని విజయలక్ష్మి, బెజవాడ సైదులు, కుంభం అనిల్ రెడ్డి, ఎడ్ల పద్మ, మందడి సునీత, దార సత్తెమ్మ కత్తుల రేణుక గొల్లి నరేష్, కొలిపాక సురేందర్, నాయకులు గద్దపాటి దానయ్య మాజీ పిఎస్పీఎస్ చైర్మన్ నూక సైదులు, మిట్టపల్లి శివశంకర్, బూరుగు శీను అయితే గొని నరసింహ, దోమల శ్రీశైలం, రెడ్డిపల్లి వీరాస్వామి, కొంపెల్లి యాదయ్య, నంద్యాల వెంకటరెడ్డి, ముత్యాల లింగయ్య ఉన్నారు.



