Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చేస్తా..ఆశీర్వదించండి

అభివృద్ధి చేస్తా..ఆశీర్వదించండి

- Advertisement -

బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కాసా నరేందర్
నవతెలంగాణ – నూతనకల్
గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తా ఒక్కసారి అవకాశమిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ బలపరిచిన అలుగునూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాసా నరేందర్ ప్రజలను కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆలుగునూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్లలో కల్లోలాలే తప్ప అభివృద్ధి జరగదని విమర్శించారు. ఉంగరం గుర్తుకు ఓటేసి  గెలిపించాలని ప్రజలను కోరారు తాను గెలిస్తే గ్రామ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. రోడ్డు నిర్మాణం మురికి కాలువల నిర్మాణం బడికి ఆట స్థలం దేవాలయం లాంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -