Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేయాలి 
నామినేషన్ల స్క్రూట్ నీళ్లను పారదర్శకంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి బ్యాలెట్ బాక్సులను పరిశీలించి ఎన్నికల నిర్వహణ పట్ల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ మాట్లాడుతూ.. ఈనెల 17న జరిగే మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈనెల 16న బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూటరీలను పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు త్రాగునీటి సౌకర్యంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలకు లోబడి స్క్రూట్ ని ప్రక్రియ జరగాలన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలని తెలుసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన హ్యాండ్ బుక్ ను అందరికీ అందజేయాలని ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరా ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీడీవో వర్కల వేదవతి, ఎంపీఓ హరినాథ్ రెడ్డి లతోపాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -