నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే స్థాయి లెవెల్ లో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. స్థానిక సంస్థల్లో కేటాయించిన గుర్తులను ప్రదర్శన చేస్తూ గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనిలో బాగానే డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో పానుగంటి రూపా సతీష్ రెడ్డికి కత్తెర గుర్తు రావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు బార్బర్ షాప్ కి వెళ్లి కత్తెర గుర్తు చూపెడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని రూపా సతీష్ రెడ్డి ని సర్పంచ్ గా మరొక్కసారి గెలిపిద్దామని ప్రజలకు వివరిస్తూ ప్రచారం జరుగుతోంది. గతంలో సైతం రూపా సతిష్ రెడ్డి సర్పంచ్ గా చేసినప్పుడు ప్రభుత్వ నీదులతో సంబంధం లేకుండా స్వతహాగానే ప్రజలకు, యువకులకు ఉపయేగ పడే కార్యక్రమలు చేసి గ్రామస్తుల మన్ననలు పొందారు. ఈ సారి సైతం రూపా సతిష్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించాలని పలువురు కోరుతున్నారు.
సుద్దపల్లిలో ఊపందుకున్న ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



