నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్ సోమవారం నూతనంగా ఏర్పాటు మిస్టర్ చాయ్ షాప్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మాజీ, మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. షాపులు సందర్శించిన ఆయన వ్యాపారం బాగా జరగాలని ఆకాంక్షిస్తూ నరేందర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అహ్మద్ హుస్సేన్, నాయకులు మల్యాల సుభాష్ గౌడ్, రేంజర్ల మహేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మిస్టర్ చాయ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



