తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చారు బిస్కెట్ దేశంలోనే తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్’లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ,’చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక ఎక్స్‌ట్రీమ్ పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా ఉంటాయి. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఉన్న కంటెంట్ సినిమాలాగే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ, ‘చారు షాట్స్ లాంచ్.. మా మైత్రి మూవీ మేకర్స్ లాంచ్ లాగే ఫీల్ అవుతున్నాను. ఈ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా ఇది చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని నమ్మకం వచ్చింది. వేల కోట్లకి ఎదిగే పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నాను. ఈ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో కొలాబరేట్ అవ్వాలని ఉంది’ అని చెప్పారు.
చారు బిస్కెట్ శరత్, అనురాగ్ మాట్లాడుతూ,’టెన్ ఇయర్స్.. 2 బిలియన్ వ్యూస్, అద్భుతమైన స్టోరీస్, టాలెంట్.. ఇదొక గొప్ప ప్రయాణం. మా లైఫ్‌లో నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడుతున్నాం. మన భారతదేశం కింగ్ ఆఫ్ స్టోరీ టెల్లర్స్. మనకి ప్రపంచంలోనే బెస్ట్ స్టోరీస్ ఉన్నాయి. అందుకే నేను అనురాగ్, కష్ణ సాయి, చారు బిస్కెట్ టీమ్, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి షార్ట్ సిరీస్ ఓటిటి ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాం. ఇండియాలో దీంతో ఒక కొత్త ఎరా మొదలు కాబోతుంది. దీని ద్వారా కొత్త టాలెంట్‌ని తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇండియా మొత్తం చూసేలా ఉండాలి. మేము ఇందులో ఇంకో మంచి ఫీచర్ తీసుకొచ్చాం. ఒక షో చూసినప్పుడు ఇందులో టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరి పేర్లు ఉంటాయి.పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ పేరు దగ్గరికి వెళ్లి క్లాప్ కూడా ఇవ్వచ్చు. మీకు నచ్చితే వాళ్లకి కొంత మనీ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మేము కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఇది’ అని తెలిపారు.
వినూత్న కంటెంట్‌కి కేరాఫ్‌గా చాయ్ షాట్స్
- Advertisement -
- Advertisement -



