Monday, December 8, 2025
E-PAPER
Homeసినిమా'ఆర్‌కె దీక్ష' ట్రైలర్‌ విడుదల

‘ఆర్‌కె దీక్ష’ ట్రైలర్‌ విడుదల

- Advertisement -

ఆర్‌ కె ఫిలిమ్స్‌, సిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్‌లో డా.ప్రతాని రామకష్ణ గౌడ్‌ నిర్మాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఆర్‌కె దీక్ష’. బిఎస్‌ రెడ్డి సమర్పణలో ఢ జోడి ఫేమ్‌ అక్స ఖాన్‌, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్‌ హీరోగా నటించారు. హీరో సుమన్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్‌, తెలుగు ఫిలిం చాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్‌, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత డా.ప్రతాని రామకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ,’5 పాటలు, 3 ఫైట్స్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్‌కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాం. ప్రేక్షకులు అంతా కలిసి మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమాలో ఒక వ్యక్తి దీక్షతో, పట్టుదలతో ఎలా ఎదుగుతారో చూడబోతున్నాం. ఈ సినిమాలో సింగిల్‌ షాట్‌లో చెప్పిన సంస్కత డైలాగ్‌ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది’ అని హీరో కిరణ్‌ చెప్పారు. హీరోయిన్‌ అక్స ఖాన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం నాతో పాటు ఎంతోమంది టాలెంట్‌ ఉన్న వారు పని చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మంచి మలుపు కావాల్సిందిగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు. డి.ఎస్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘రామకష్ణ గౌడ్‌ ఈ సినిమాలోని ఒక పాటలో దేశ జవాన్లను చూపించడం హర్షించదగిన విషయం. నేను కూడా గతంలో దేశం కోసం ఎయిర్‌ ఫోర్సులో పనిచేశాను. కాబట్టి నాకు ఆ పాట బాగా కనెక్ట్‌ అయ్యింది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘ఎన్టీ రామారావు ‘దీక్ష’ సినిమా పేరు మీద మనకు సినిమా రావడం హర్షించదగిన విషయం. రామారావు ఆశీస్సులు సినిమాకు కచ్చితంగా ఉంటాయి’ అని తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ నిర్మాత మండల సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -