కనీస వసతుల కల్పనపై ఆందోళన
పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గని విద్యార్థులు
విద్యార్ధులకు మద్దతుగా నేడు తల్లిదండ్రుల ధర్నా
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
మహేశ్వరం మెడికల్ కళాశాలలో కనీస వసతుల కల్పనపై మెడికోలు మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు జోక్యం చేసుకున్నా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని భీష్మించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో (అద్దె భవనం) కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాలలో సోమవారం జరిగింది. మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇబ్రహీంపట్నంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నెలకొల్పింది. అరకొర వసతుల మధ్యనే గత సంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు దశలవారీగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దాంతో ఫలితం లేక సోమవారం విద్యార్థులు కళాశాల ఆవరణలోనే ఆందోళనకు దిగారు. సమస్యలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఒక్కసారిగా పోలీసులు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యం లో అధికార యంత్రాంగం అంతా పంచాయతీ ఎన్నికల్లో నిమగమై ఉన్నదని, ధర్నాను విరమించాలని సూచించారు. ఎన్నికలు ఈ నెలలోనే ప్రారంభమయ్యాయని, కానీ తాము గత సంవత్సర కాలంగా ప్రభుత్వం, ఉన్నతాది óకారుల దృష్టికి తమ సమస్యలను తీసుకుపోతూనే ఉన్నామని ఎందుకు పరిష్కరిం చలేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థు లు మాట్లాడుతూ.. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య విద్యాభ్యాసాన్ని కొనసాగిం చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కళాశాల ఒక చోట ఉంటే.. ప్రాక్టికల్స్ మరోచోట చేయాల్సి వస్తోందని తెలిపారు. తాము నిత్యం 40 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలో లైబ్రరీ, ప్రయో గశాలలు, ఇతర ముఖ్యమైన బోధనా సౌకర్యాలు లేవన్నారు. పీజీ కళాశాల, విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవ డంతో ప్రయివేటు హాస్టళ్లలో ఉంటు న్నామని తెలిపారు. ఉదయం, సాయంత్రం కలిపి ఆరు కిలోమీ టర్ల దూరం నడవాల్సి వస్తున్నదని అన్నారు. విద్యార్థుల నుంచి నిధులు వసూలు చేస్తున్న అభివృద్ధి నిధులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ సమస్యలను పెడచెవిన పెడుతోందని ఆందోళన వెలిబుచ్చారు.
జూనియర్ డాక్టర్ల మద్దతు..
విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు జూనియర్ డాక్టర్ల సంఘం మద్దతు ప్రకటించింది. వారి సమస్యలు పరిష్కరించే వరకు వారు నిర్వహించే ఉద్యమాల్లో భాగస్వాములవుతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. నిరవధిక ఆందోళనకు నిర్వహిస్తే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని, అవసరమైతే ఆ ధర్నాలో భాగస్వామి అవుతామని తెలిపారు.
మెడికల్ క్యాంపస్‌లో విద్యార్ధుల మెరుపు ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



