నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ
నవతెలంగాణ-లక్నో :
టైటిల్ ఫేవరేట్‌గా సీజన్‌ను మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు చివరి-4లో నిలువకుండా ఉండేందుకు బరిలోకి దిగుతోంది. 11 మ్యాచుల్లో 3 విజయాలే సాధించిన సన్‌రైజర్స్ నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. టాప్-4 రేసులో ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు పంత్‌సేన నేడు సొంతగడ్డపై విజయమే లక్ష్యంగా ఆడనుంది. నేడు సన్‌రైజర్స్ చేతిలో ఓడితే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు కానున్నాయి. సన్‌రైజర్స్, సూపర్‌జెయింట్స్ నేడు లక్నోలో తలపడనున్నాయి.
హెడ్‌కు కోవిడ్ :
ట్రావిశ్ హెడ్ ఆసీస్‌లో కరోనా బారిన పడ్డాడు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన హెడ్ నేడు ఉదయమే భారత్‌కు రానున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో హెడ్ ఆడేది అనుమానంగానే ఉంది. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ప్రమోట్ అయితే.. సచిన్ బేబి, హర్ష్ దూబెలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్‌లు సహా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్, మహ్మద్ షమి పేలవ ఫామ్‌లో ఉన్నారు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. చివరి మూడు మ్యాచుల్లోనైనా గెలుపొంది.. సీజన్‌ను మెరుగ్గా ముగించాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
చావోరేవో :
లక్నో సూపర్‌జెయింట్స్‌కు నేడు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ జట్టులోనూ కీలక ఆటగాళ్లు డీలా పడ్డారు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర దక్కించుకున్న రిషబ్ పంత్ దారుణంగా విఫలమవగా.. డెవిడ్ మిల్లర్ ఫినిషర్‌గా తేలిపోయాడు. అబ్దుల్ సమద్, ఆయుశ్ బదానిలు నిలకడగా రాణించినా.. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించటం లేదు. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఆరంభంలో చూపిన దూకుడు ఇప్పుడు అమాంతం పడిపోయింది. బంతితోనూ సూపర్‌జెయింట్స్‌కు అన్ని సమస్యలే. శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్‌లు అంచనాలను అందుకోవటం లేదు. రవి బిష్ణోరు, దిగ్వేశ్ రాఠి మాయజాలం సరిపోవటం లేదు.
మెరుగ్గా ముగిస్తారా?
- Advertisement -
- Advertisement -