నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ నాగనాథ్ పటేల్, మాజీ సర్పంచ్ రాజాగౌడ్, మాజీ సర్పంచ్ బాలమణి, మాజీ ఎంపీటీసీ నందేవ్, ప్రముఖ నాయకుడు రాములు, అలాగే వారి అనుచరులు, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..మహ్మదాబాద్ గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుతుండటం ప్రభుత్వ పనితీరు, విశ్వాసానికి నిదర్శనం అని అన్నారు. మహ్మదాబాద్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్, సాయగౌడ్,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ పటేల్,పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.



