– ఆయన మరణం తీరని లోటు
– కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా ఉద్యమాలే ఊపిరిగా జీవించిన గొప్ప వ్యక్తి రఘుపాల్ అనీ, ఆయన మరణం తీరని లోటు అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. బాల్యం నుంచి చనిపోయే వరకు సిద్ధాంత నిబ ద్ధతతో పనిచేశారనీ, సాధారణ జీవితం గడిపి ఆదర్శ ప్రాయంగా నిలిచారని కొనియాడారు. నేటి తరానికి ఆయన ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. ఆయనతో తమకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా సమకాలీన పరిస్థి తులకు వర్తింపజేస్తూ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. యువ నాయ త్వాన్ని తయారు చేయడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కార్మిక ఉద్య మాన్ని నిర్మించడంలోనూ ప్రధాన భూమిక పోషించారని గుర్తుచేశారు.
ఆయన మృతి తీరని లోటు : వి.శ్రీనివాసరావు
సీనియర్ నాయకులు రఘుపాల్ మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాదర్శి వి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన బాల్యమంతా తండ్రితో కలిసి ఆజ్ఞాతంలోనే గడిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) విస్తరణకు తనవంతు కృషి చేశారని పేర్కొ న్నారు. 1994 నుంచి రాష్ట్ర కేంద్రానికి, విజ్ఞాన కేంద్రాలకు సహాయమందిచారని గుర్తుచేశారు.