– మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం బీర్లను, బార్లను నమ్ముకుని పాలన కొనసాగిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో మద్యంపై రాద్దాంతం చేసిన నేతలే, నేడు ఆదే మద్యం ధరలు పెంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎక్సైజ్ విధానాన్ని పున్ణ పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తామనీ, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒకవైపు ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు సరైన కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు.
బీర్లను, బార్లను నమ్ముకొని రాష్ట్రంలో పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES