Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభ్యర్థుల గెలుపు మీది.. అభివృద్ధి నాది 

అభ్యర్థుల గెలుపు మీది.. అభివృద్ధి నాది 

- Advertisement -

• ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని పలు గ్రామాలలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు మీది అభివృద్ధి నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలంలోని ఆయా గ్రామాల ఓటర్లకు హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని యరగండ్లపల్లి, తమ్మడపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు, ఇండ్లు కూడా రాక నిరుపేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇండ్లు కూడా విడుతలవారీగా మంజూరు అవుతున్నాయని, మునుముందు ప్రభుత్వం సబ్బండ వర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, సర్పంచ్ అభ్యర్థులు పులిమామిడి నర్సిరెడ్డి, వెంకటంపేట బాలయ్య, కొడాల వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -