– రక్షణ, వాణిజ్య, భౌగోళిక రాజకీయాలకే ప్రాధాన్యత
లండన్: ఇంగ్లండ్- యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య సోమవారం లండన్‌లో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇయు నుంచి బ్రిటన్ నిష్క్రమించిన దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఇలాంటి సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి సమావేశంలో రక్షణ-భద్రత, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ అంశాలకు ప్రాధాన్యతను లభించనుంది. ఈ అంశాలపై ఉమ్మడి ప్రకటనను కూడా వెల్లడించే అవకాశం ఉంది. బ్రిటన్ నుంచి ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలో బృందం, ఇయు తరపున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు అంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సూలా వాన్ డేర్ లెయాన్ నేతృత్వంలో బృందం నేటి శిఖరాగ్ర సమావేశంలో చర్చలు జరపనున్నాయి. కాగా, సోమవారం ఈయూతో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేడు ఇంగ్లండ్-ఇయు శిఖరాగ్ర సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES