Monday, May 19, 2025
Homeరాష్ట్రీయంమద్యం ధరలు పెంపు

మద్యం ధరలు పెంపు

- Advertisement -

– క్వార్టర్‌కు రూ.20, ఫుల్‌ బాటిల్‌కు రూ.40 నేటి నుంచి అమల్లోకి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కో బీర్‌ బాటిల్‌పై రూ.30 పెంచిన ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం సరఫరా కోసం లిక్కర్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్‌ 30తో ముగియనున్న నేపథ్యంలో ధరల కమిటీ సిఫారసు, మద్యం కంపెనీల విజ్ఞప్తి మేరకు రేట్లను పెంచినట్టు భావిస్తున్నారు. విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలను పెంచింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదివారం సర్క్యూలర్‌ జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, చీప్‌ లిక్కర్‌ ధరల్లో ఎలాంటి మార్పులుండబోవని పేర్కొంది. పెరిగిన ధరల వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.3,500 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
గత నెలలోనే నిర్ణయం
మద్యం ధరలను పెంచాలని గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్‌ జడ్జి జైస్వాల్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బీర్లు, లిక్కర్‌ ధరలను పెంచాలని గతేడాది చివర్లోనే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీర్లు, లిక్కర్‌ ధరలను ఒకే సారీ పెంచితే ప్రజల్లో వ్యతిరేక త వస్తుందనే భయంతో విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమం లో నే ప్రభుత్వం ఫిబ్రవరిలో బీర్ల ధరలను 15 శాతం పెంచింది. ఫలితంగా అన్ని రకాల బీర్లపై సగటున రూ.30 వరకు పెరిగింది. తాజాగా క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -