నవతెలంగాణ-హైదరాబాద్: వారం రోజుల నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఆకస్మాత్తు పరిణామంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టులో విమానాల సమాచారం వేచి చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో ఇండిగో యాజమాన్య నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ..ప్రయాణికులు ఆందోళన నిర్వహించారు. నిరసనలు తీవ్రతరంగా కావడంతో కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకున్నా…పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం వేళ.. రైలు డ్రైవర్లు కూడా పనిగంటల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
రైల్వే శాఖలో కూడా తీవ్రమైన లోకో ఫైలట్ల కొరత ఉందని, అధిక పనిగంటలతో ఒత్తిడి ఎక్కువ అవుతుందని, కేంద్రం ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎ్‌సఏ) డిమాండ్ చేసినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలవరించాయి. ఈ విషయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాలని రైల్వే శాఖకు సూచించారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సహనం ప్రదర్శిస్తోందని, ప్రభుత్వ లోకోపైలట్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటోందని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎ్‌సఏ) విమర్శించింది.
ఎంతో కాలం నుంచి లోకో పైలెట్లు ఎదుర్కొంటున్న సమస్యలే ఎయిర్‌లైన్స్‌లో ప్రస్ఫుటంగా కనిపించాయని ఆ యూనియన్ తెలిపింది. ఫేటిగ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎంఎస్) ఆధారిత పనిగంటల వ్యవస్థను రైల్వే అవలంభించాలని, రోజు వారీగా ఆరు గంటల పని, ప్రతి షిఫ్ట్ తర్వాత 16 గంటల విశ్రాంతి తదితర అంశాలను ఆ యూనియన్ ప్రస్తావించింది.



