Wednesday, December 10, 2025
E-PAPER
Homeజిల్లాలుపనిచేసే నాయకులకు ఓటు వేసి గెలిపించాలి

పనిచేసే నాయకులకు ఓటు వేసి గెలిపించాలి

- Advertisement -

ఎర్రజెండాతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
తడకమళ్ళ లో జూలకంటి ఇంటింటి ప్రచారం 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఓటు వేస గెలిపించాలని, ఎర్రజెండాతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి నగేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు, వృద్ధులకు, యువకులకు, రైతులకు నేరుగా కలిసి సీపీఐ(ఎం) పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం ఎర్రజెండాతోనే సాధ్యమైందని ఆనాడే గ్రామాల అభివృద్ధి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు సాధ్యంలో సాగిందని గుర్తు చేశారు. ఎర్రజెండాతోనే గ్రామాల అభివృద్ధితోపాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. డబ్బు మద్యం ప్రలోభాలకు గురి కాకుండా నిజమైన, నిజాయితీ గల ప్రజా సేవకులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

లక్షలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక రెట్టింపు సంపాదించుకుంటారన్నారు. కానీ ఎర్రజెండా అభ్యర్థులు అలా కాకుండా కేవలం ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు చౌగాని సీతారాములు, డా మల్లు గౌతమ్ రెడ్డి, అభ్యర్ధి నగేష్, చౌగాని వెంకన్న, సైదమ్మ, ఎండి అంజద్, సోమయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -