సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులుొ
హెలిక్యాప్టర్ ద్వారా కలెక్టర్ ఏరియల్ సర్వే
నవతెలంగాణ-భూపాలపల్లిపుష్కరాల
వేల జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రం జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పోటెత్తారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ట్రాఫిక్ జామ్ కావడంతో ఎదురైన ఇబ్బందులు పునరావతం కాకుండా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాహనాల రాకపోకలు సాగాయి. కాళేశ్వరంలో ప్రజల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. నది తీరం, వాహనాలు రాకపోకలతో పాటు ఏర్పాట్లు తదితర సేవలను పర్యవేక్షించారు. ఉదయం నుండి కలెక్టర్ విస్కృతంగా పర్యటించారు. సరస్వతి ఘాట్, త్రివేణి సంగమం, ఆరోగ్య శిబిరం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం, పుష్కర విధులు నిర్వహించు సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనశాల తదితర ప్రాంతాలల్లో పర్యటించారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్నదని, సోమవారం వరకు అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులు వెళ్లేందుకు వీలుగా అదనంగా తాత్కాలిక రహదారి వేయాలని తెలిపారు. వ్యర్థాలు వేసేందుకు అదనంగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు. సంగమ ప్రాంతంలో అపరిశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్, డిపిఓకు సూచించారు. భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని దేవస్థానం సిబ్బందిని కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రత, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజలకు అనువుగా జారు రైడ్ : జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ
భక్తులు కాళేశ్వరం అందాలను వీక్షించేందుకు అనువుగా జారు రైడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సరస్వతి ఘాట్ ప్రాంతాలను పరిశీలించారు. సరస్వతీ పుష్కరాలకు వచ్చే సందర్శకులకు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు ప్రక్కల అడవులు తదితర అందాలను వీక్షించడానికి జారు రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట కరీంనగర్ సిపి గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు ఉన్నారు.
జనసంద్రంగా కాళేశ్వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES